ఆగస్టు 19 2024 శ్రీరామపురము, గరువుపాలెం మరియు యానాది కాలని ( నిజాంపట్నం మండలం,బాపట్ల జిల్లా) రైతులు రైతు కూలీలకు సోమవారము ఉదయం 10 గంటలకు రాణా వెల్ఫేర్ సొసైటీవారు పాము కాటుకకు Naja – 200 హోమియో పతి మందు ఉచితంగా గ్రామ సర్పంచి అరవ శంకర్ రావు మరియు Dr కొలసాని పృద్వి అధ్వర్యంలో పంపిణీ చేసినారు. Dr పృథ్వీ మాట్లాడుతూ పాము కాటుక గురి అయిన వెంటనే 5 బిళ్లలు పది నిమిషాలు తరువాత 5 బిళ్లలు మళ్ళి పది నిమిషాలు తరువాత 5 బిళ్లలు వేసుకొని దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్ళగలరు. హాస్పటల్ వెళ్ళు సమయంలో ఈ మాత్రలు మీకు రక్షణగా, మీ యొక్క ప్రమాద తీవ్రత తగ్గించే విధంగా సహాయం చేస్తుంది. పాము కరచిన వ్యక్తి త్వరగా కోలుకుంటారు అని చెప్పారు. సర్పంచ్ అరవ శంకర్ రావు మాట్లాడుతూ రాణా వెల్ఫేర్ సొసైటీ వారు పాము కాటుకు ఉచిత మందు పంపిణీ మా గ్రామంలో చేసినందుకువారికి మా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాణా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు సుంకర సాంబశివరాయల్ మాట్లాడుతూ శ్రీరామపురం గ్రామ పెద్దలు కొలసాని వెంకటస్వామి నాయుడు కోరిక మీద ఉచిత హోమియోపతి మందు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకు నగరం మండలం కోల గాని వారి పాలెం లో ఈ ఉచిత హోమియోపతి మందు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాణా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
రైతులకు రైతు కూలీలకు హోమియోపతి పాముకాటు ముందు ఉచిత పంపిణీ చేసిన రానా వెల్ఫేర్ సొసైటీ వార
67 Views