AP: కోనసీమ జిల్లాలో విషాదం నెలకొంది. చింతవారిపేట
వద్ద ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ
ప్రమాదంలో తల్లీ, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మరొక వ్యక్తి
ఈ ప్రమాదం నుండి బయటపడ్డాడు. అరకు నుండి పి.గన్నవరం
మండలం పోతవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని
మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం కేసు నమోదు
చేసి దర్యాప్తు చేపట్టారు.
38 Views