పతంజలి ఫుడ్స్ లిమిటెడ్, అంపాపురం నందు పూజ్య రాందేవ్ బాబా ఆశీస్సుల తో ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ, ఏలూరు వారి ఆధ్వర్యంలోమెగా రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సంస్థ డీజిఎం కలపాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రక్తదానం చేసిన దాతలు కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉపయోగిస్తున్నందుకు సంతోషం తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ క్లబ్ ఏలూరు వారికి మరియు రెడ్ క్రాస్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియచేసారు. మరియు భవిష్యత్ లో కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తాము అన్నారు. మరియు ఈ కార్యక్రమం లో సంస్థ హెచ్ఆర్ జి. చంద్రశేఖర రావు, రెడ్ క్రాస్ పి ఆర్ ఓ. కేవీ రమణ తదితరులు పాల్గొన్నారు

36 Views