TG: హైదరాబాద్లో న్యూఇయర్ వేళ శాంతి భద్రతలకు
విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు
చర్యలు తీసుకుంటున్నారు. అర్ధరాత్రి 1 గంట వరకే
ఈవెంట్స్ నిర్వహించాలని, సీసీ కెమెరాలు తప్పనిసరి
అని నిర్వహకులకు సూచించారు. 15 రోజుల ముందే
కచ్చితంగా అనుమతి తీసుకోవాలన్నారు. వేడుకల్లో
అశ్లీల నృత్యాలపై నిషేధం విధించారు. తాగి వాహనం
నడిపితే రూ.10వేల ఫైన్, 6 నెలలు జైలుశిక్ష విధిస్తామని
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.
40 Views