విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. రైతులు
ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్కి వినతిపత్రం
ఇచ్చేందుకు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు
దేవినేని అవినాశ్న పోలీసులు అడ్డుకున్నారు. సీఎం
పర్యటన నేపథ్యంలో ఎటువంటి ర్యాలీలకు అనుమతి
లేదని పోలీసులు తెలిపారు. తామేమి ధర్నాలకు వెళ్లడం
లేదని వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్నామని అవినాశ్
పోలీసులకు తెలిపారు. పర్మిషన్ లేదని చెప్పడంతో
రోడ్డుపై బైఠాయించారు.
40 Views