News Website And App
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలురాజకీయంవాతావరణంవ్యవసాయం

సున్నపు రాయి రవాణాకు రెవెఅక్రమన్యూ అండదండలు..!

అధికారుల అండదండలతో యథేచ్ఛగా సున్నపు రాయి రవాణా?

సున్నపు రాయి రవాణాకు రెవెఅక్రమన్యూ అండదండలు…!

రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా – కొండలే కాదు పొలాలూ కనుమరుగవుతున్నాయి!

,ఏలూరు జిల్లాలో,నూజివీడు నియోజకవర్గం, ఆగిరిపల్లి మండలం లో సాగరం లో మైనింగ్ మాఫియా కొండలు, గుట్టలే కాదు పచ్చని పంట పొలాలు కనుమరుగైపోతున్నాయి. మట్టిని సొమ్ము చేసుకునేందుకు అడ్డగోలుగా తవ్వకాలు చేస్తున్నారు. ఆగిరిపల్లి మండల పరిధిలో సాగరం లో సున్నపు రాయి నిక్షేపాలతో మైనింగ్ ట్రాక్టర్లతో, టిప్పర్లతో అర్ధరాత్రులు సున్నపురాయిని తరలిస్తున్నారు అని చుట్టుపక్కల ఉన్న కొంతమంది ప్రజలు చెబుతున్నారు.
అంతేకాదు… అక్రమ సునపు రాయి రవాణా పై ఫిర్యాదు చేసిన వారి పేర్లను రెవెన్యూ అధికారులు ఆ మైనింగ్ యజమానికి తెలపటం వారినీ ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టించడం విశేషం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సున్నపు రాయి మాఫియా అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఈ అక్రమ సున్నపు రాయి దందాపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వస్తున్న కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో ఈ అక్రమ వ్యాపారానికి రెవెన్యూ అధికారులు అండదండలు ఉన్నాయనే విమర్శలకు మరింత బలం చేకూరుతుంది.సాగరం లో ఉన్న సున్నపురాయి మైనింగ్ వారికి ఎటువంటి అనుమతులు లేకుండా జరుగుతున్నా కూడా పట్టించుకోని అధికారులు దీనిపైన ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు రెవిన్యూ అధికారులే మైనింగ్ చేస్తున్న వారితో కేసులు పెట్టిస్తున్న వైనం. ఉన్నత అధికారులు స్పందించి తక్షణమే విరి పై తగు చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుకుంటున్నారు.

41 Views

Related posts

రిపోర్టర్ పై మోహన్ బాబు దాడి…

Star K Prime News

నేడు రాజ్యసభలో ముగ్గురు సభ్యుల ప్రమాణస్వీకారం

Star K Prime News

కేంద్ర రాష్ట్ర,ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలతో రైతాంగం కుదేలు

Star K Prime News

Leave a Comment

హోమ్
రిపొర్టర్స్ న్యూస్ పోస్ట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ