హనుమాన్ జంక్షన్ , నవంబర్ : 29
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ నుండి ఈ నవంబర్ నెల 24, 25, 26 తేదీలలో విశాఖపట్నంలోని పోర్టు స్టేడియంలో జరిగిన 19th వొడొకయ్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2023 పోటీలలో భారతదేశం తరుపున కృష్ణా జిల్లా, హనుమాన్ జంక్షన్ కు చెందిన టైగర్ పవర్ కిక్ బాక్సింగ్ అండ్ కరాటే స్కూల్ విద్యార్థులు మొత్తం పదమూడు మంది పాల్గొని విజేతలైనందుకు కోచ్ సెన్సే కట్టా సుధాకర్ ని మరియు విద్యార్థులని కృష్ణా జిల్లా కలెక్టర్ రాజా బాబు ప్రశంశించారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటలలో కూడా పాల్గొంటే ఆరోగ్యంతో పాటు మానసిక వికాసం తద్వారా చదువు అభివృద్ధి చెందుతాయని తెలియజేసారు. ఈ సందర్బంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ సెన్సే కట్టా సుధాకర్ నాకు ముందునుంచే తెలుసని పిల్లలకు ఆత్మ రక్షణ విద్యలు నేర్పడంలో తన కృషి అభినందనీయమని తెలియజేసారు. నారాయణ విద్యా సంస్థల కృష్ణ జిల్లా జోన్ – 2 ఏ జి యం సి హెచ్ అనిల్ కుమార్ మరియు ఆర్ ఐ డి సత్తి రెడ్డి కూడా కోచ్ కట్టా సుధాకర్ ని విద్యార్థులని అభినందించారు. కోచ్ సెన్సే కట్టా సుధాకర్ మాట్లాడుతూ జనవరి లో జరగబోయే కిక్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు జరిపే నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలలో కూడా మా విద్యార్థులు పాల్గొంటారని తెలియజేసారు.