శభాష్ తిరువూరు పోలీస్
తిరువూరు,ఎన్టీఆర్ జిల్లా :-
మైలవరం డివిజన్,తిరువూరు పోలీసు స్టేషన్ పరిధిలో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో నిందితురాలి అరెస్టు. దొంగతనం జరిగిన 24 గంటల వ్యవధిలో నిందితులను పట్టుకొని అరెస్టు చేసి, వారి వద్ద నుండి దొంగిలించబడిన మొత్తం పొత్తును రికవరీ చేయడం జరిగింది.నిందితుల వివరములు మరియు నేరం జరిగిన వివరములు తెలిపిన రూరల్ DCP, K.M.మహేశ్వరరాజ.
ది 07.12.2024 వ తేదీన మద్యాహ్నం 1.15 గంటల నుండి 1.45 గంటల మధ్య సమయములో తిరువూరు పట్టణంలోని మధిర రోడ్ నుండి పాత తిరువూరు ఆటో లో వెళ్ళుచున్న కంచి నవ్యశ్రీ అను వారు మరియు ఆమె బందువులకు చెందిన బ్యాగ్లో నుండి అదే ఆటో లో ప్రయాణించిన నిందితులు బంగారపు ఆభరణాలు దొంగిలించగా ది 08.12.2024 వ తేదీన తిరువూరు పట్టణం శివారు ఆంధ్రా-తెలంగాణ బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గరలో ఉన్న పశువుల సంత వద్ద నిందితులలో ఒక వ్యక్తిని పట్టుకొని ఆమె వద్ద నుండి దొంగిలించబడిన మొత్తం సొత్తును రికవరీ చేసి, సాయంత్రం 5.00 గంటలకు తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ K.గిరిబాబు అరెస్టు చేసినట్లు పత్రికా సమావేశములో రూరల్ DCP. K.M. మహేశ్వరరాజు వెల్లడించారు.
*కేసు పూర్వాపరాలలోనికి వెళితే*
సిర్యాధి ఓణీల ఫంక్షన్ ది.08.12.2024వ తేదీన తిరువూరు లో ఉన్నందున భవానిపురం లో ఉన్న ఆమె మామయ్య ది. 07.12.2024వ తేదీన తిరువూరు వచ్చుటకు రెండు బ్యాగ్ లలో బట్టలు, బంగారు ఆభరణములు 1) రెండు నెక్లెస్లు, 2) రెండు జతల కమ్మలు, వాటి మాటీలు, 3) 2 చంద్రహారాలు, 4) ఒక బుట్టల జత, 5) ఒక బారు చైన్, దానికి ఉన్న వెంకటేశ్వరస్వామి లాకెట్, 6) 4 బంగారు గాజులు, 7) ఒక ఉంగరం లను ఒక బాక్స్ లో పెట్టి ఆ బాక్స్ ను ఒక బ్యాగ్ లో పెట్టి ఉదయం 11.45 గంటల సమయంలో భవానిపురం లో తిరువూరు బస్ ఎక్కి, మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో తిరువూరు పట్టణంలోని మధిర రోడ్ లో వారి వెంట తెచ్చుకున్న రెండు బ్యాగ్ లను తీసుకొని దిగి, అక్కడనుండి ఒక ఆటో మాట్లాడుకొని వారి ఇంటికి పాత తిరువూరు వెళ్ళుచుండగా వారితో పాటు బస్ దిగిన ఇద్దరు ఆడవారు అదే ఆటో లో ఎక్కి వారి పక్కన కూర్చొని రేగి చెట్టు సెంటర్ లో దిగివెళ్ళిపోయినట్లు, పిర్యాధి ఇంటికి వెళ్ళి బ్యాగ్ లు ఓపెన్ చేసి చూడగా బ్యాగ్ లో పెట్టిన బంగారపు ఆభరణాలు ఉంచిన బాక్స్ కనిపించక పోయేసరికి వారితో ఆటో లో ప్రయాణించిన ఆడవారు బ్యాగ్ జీప్స్ తీసి బ్యాగ్ లోని బంగారపు ఆభరణాలు ఉన్న బాక్స్ ను దొంగిలించినారు అని గ్రహించి, జరిగిన విషయం నవ్యశ్రీ తల్లిదండ్రులకు చెప్పి, అదే రోజు అనగా ది.07.12.2024 వ తేదీన పిర్యాధి ఇచ్చిన రిపోర్ట్ పై ఎఫ్బిఆర్ రిజిస్టర్.
నిందితులు పట్టుబడిన వైనం…..
రాబడిన రహస్య సమాచారము మేరకు ది.08.12.2024వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తిరువూరు CI గారు, తిరువూరు SI గారిని, మరియు PC’s 4374, 4161, WPC 4234 లను మరియు మద్యవర్తులను వెంటపెట్టుకొని తిరువూరు పట్టణం శివారు ఆంధ్రా-తెలంగాణ బార్డర్ చెక్ పోస్ట్ వద్దకు వెళ్ళి అనుమానం గా ఉన్న ఒక మహిళను అదుపులోని తీసుకొని విచారణ అనంతరం ఆమెను ఈ కేసులో ముద్దాయి గా నిర్ధారించి నిన్న సాయంత్రం 5.00 గంటలకు అరెస్ట్ చేసి, దొంగిలించబడిన మొత్తం సొత్తు 275 గ్రాముల బరువు గల బంగారు ఆదరణాలు Rs. 12,50,000/- ల విలువ గలవి 1) రెండు నెక్లెస్లు, 2) రెండు జతల కమ్మలు, వాటి మాటీలు, 3)2 చంద్రహారాలు, 4) ఒక బుట్టల జత, 5) ఒక రు చైన్, దానికి ఉన్న వెంకటేశ్వరస్వామి లాకెట్, 6) 4 బంగారు గాజులు, 7) ఒక ఉంగరం లను రికవరీ చేసినట్లు రూరల్ DCP, K.M. మహేశ్వరరాజు వెల్లడించినారు.
నిందితురాలు పూర్వాపరాలు…….
‘ఈ కేసులో నిందితురాలు మేకల లక్ష్మి, భర్త: వెంకటేష్, వయస్సు: 42 సంవత్సరాలు, కులము:తెలగ సాముల, సమ్మెటవారిగూడెం, H/O చింతలపూడి గ్రామం మండలం, ఏలూరు జిల్లా. ఆమెకు వివాహం అయి భార్య భర్త ఇరువురు పరువేరుగా దొంగతనాలు చేస్తున్నట్లు, అదే ఊరికే చెందిన మేకల సరోజనీ భర్త: రామకృష్ణ, వయస్సు సుమారు 50 సంవత్సరాలు తో కలిసి దొంగతనాలు చేస్తున్నట్లు, వీరు బస్ లలో వెళ్ళ పాసింజర్ల బ్యాగ్ లలో ఉన్న డబ్బు, బంగారు వస్తువులను దొంగతనాలు చేస్తూ సమానముగా పంచుకొని ఆ డబ్బులతో జల్సాలు చేస్తుంటారు. ది.07.12.2024 వతేదీన మేకల లక్ష్మి, మేకల సరోజనీ తిరువూరు వచ్చి అక్కడ నుండి చీమలపాడు వెళ్ళి అక్కడ విజయవాడ నుండి తిరువూరు వైపు వస్తున్న ఎక్స్ ప్రెస్ బస్ ఎక్కి బస్ లో పిర్యాదిని ఆమె పక్కన ఉన్న వారిని గమనించి వారితో పాటు తిరువూరు మధిర రోడ్ సెంటర్ దగ్గర బస్ దిగి పిర్యాది మాట్లాడుకున్న ఆటో లోనే ప్రయాణించి, వారి బ్యాగ్ ఉప్స్ తీసి అందులో నుండి బంగారపు ఆదరణాలు ఉన్న బాక్సీ దొంగిలించినట్లు తెలిపినారు. నిందితురాలి పై గతంలో నమోదు కబడిన కేసులు……
1) వి.ఎం.బంజర్ పోలీసు స్టేషన్ లో Cr.No.77/2023 U/s 379 IPC.
2) కల్లూరు పోలీసు స్టేషన్ లో Cr.No. 76/2023 U/s 379 R/w 511 IPC.
3) విస్సన్నపేట పోలీసు స్టేషన్ లోCr.No.115/2024 U/s 379 IPC.
4) చింతలపూడి పోలీసు స్టేషన్ లో Cr.No.132/2022 U/s 307 IPC.
అరెస్టు అయిన నిందితురాలి వివరములు:
1) మేకల లక్ష్మి, భర్త: వెంకటేష్, వయస్సు. 42 సం.లు, కులం: తెలగపాముల, సమ్మెటవారిగూడెం, H/O చింతలపూడి గ్రామం & మండలం, ఏలూరు జిల్లా.
ఈ కేసును 24 గంటల వ్యవధిలోపు ఛేదించి మొత్తం సొత్తును రికవరీ చేసి, నిందితులను అరెస్ట్ చేసిన ధర్యాప్తు అధికారి తిరువూరు CI, K.గిరిబాబు, తిరువూరు పోలీసు స్టేషన్ SI-I K.V.G.V. సత్యనారాయణ, S1-1| V. వెంకటరావు లను మరియు సిబ్బంది ని అభినందించినారు.