రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు సీక్వెల్ లేదని
సీనియర్ నటుడు శ్రీకాంత్ తెలిపారు. ఈ సినిమాలో
ఆయన ఓ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఓ
ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఈ మూవీలో అప్పన్న
పాత్రలో రామ్ చరణ్ నటన చూసి అందరూ షాక్
అవుతారు. చాలా కొత్తగా కనిపిస్తాడు. ఇందులో SJ
సూర్య పాత్ర “సరిపోదా శనివారం” సినిమా క్యారెక్టర్ను
మించి ఉంటుంది’ అని చెప్పారు. శంకర్ దర్శకత్వం
వహించిన ఈ చిత్రం 2025 జనవరి 10న రిలీజ్
కానుంది.
43 Views